కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం కొత్తగా 424 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 52,704 మందికి మహమ్మారి సోకింది. వీరిలో 48,293 మంది కోలుకోగా.. 3982 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో జిల్లాలో తాజాగా నలుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనాతో జిల్లాలో 429 మంది మరణించారు.
విజృంభిస్తున్న కరోనా.. జిల్లాలో తాజాగా నలుగురు మృతి - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. అంతకంతకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు.
corona cases in kurnool district