కర్నూలు జిల్లాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. జిల్లాలో వైరస్ వ్యాప్తి మొదలైన దగ్గర్నుంచి రోజుకు వెయ్యి, అంతకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. సోమవారం 372 కేసులు మాత్రమే నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 33,952 మందికి వైరస్ సోకగా.. 26,407 మంది మహమ్మారిని జయించారు. 7248 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే 37 మంది బాధితులు కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు.
కర్నూలు జిల్లాలో తగ్గిన కరోనా కేసులు - కర్నూలు జిల్లాలో కరోనా కేసుల వార్తలు
కర్నూలు జిల్లాలో తాజాగా 372 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఒక్కరోజు కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది. సోమవారం ఒక్కరోజే 37 మంది బాధితులు కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు.
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు