కలెక్టరేట్లో కరోనా కలకలం... అప్రమత్తమైన అధికారులు ! - కలెక్టరేట్లో కరోనా కలకలం
కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బయటి వ్యక్తులు ఎవరినీ కార్యాలయం ఆవరణలోకి అనుమతించవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
కలెక్టరేట్లో కరోనా కలకలం
కర్నూలు కలెక్టర్ కార్యాలయ అవరణలోకి బయటి వ్యక్తులు ఎవరూ రాకుడదని ఉన్నతాధికారులు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో అధికారులు చర్యలు చేపట్టారు. కార్యాలయంలోకి వెళ్లాలంటే తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూసి వివరాలు నమోదు చేసుకోవాలని కిందిస్థాయి సిబ్బందికి సూచించారు. ఇప్పటికే కార్యాలయ ఆవరణలోని టీ దుకాణాలు, జీరాక్స్ సెంటర్లు, క్యాంటీన్లు ముసివేశారు.