కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న 9 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 584కు చేరింది. ఇప్పటి వరకు 284 మంది కరోనాను జయించి ఇంటికి చేరుకున్నారు. కోవిడ్ ఆసుపత్రుల్లో 284 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ను జయించినవారు, ఆ మహమ్మారి బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య జిల్లాలో ప్రస్తుతం సమానంగా ఉంది. కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 16 మంది మరణించారు.
కేసులు పెరుగుతున్నా.. తగ్గిన ఉధృతి - corona update in karnool
కర్నూలులో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నా.. గతంలోని ఉధృతి తగ్గింది. నిన్న 9 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన వారి సంఖ్య, ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య సమానమైంది.
మంగళవారం నమోదైన 9 మందిలో ఏడుగురు కర్నూలు, ఇద్దరు నంద్యాల పట్టణానికి చెందిన వారు ఉన్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. కర్నూలులో మొత్తం 373, కర్నూలు రూరల్ 2, నంద్యాల పట్టణంలో 114, నంద్యాల రూరల్‌లో 10, కోడుమూరు 12, నందికొట్కూరు 10, నందికొట్కూరు రూరల్ 1, పాణ్యం 9, ఆత్మకూరు 8, బనగానపల్లె 6, ఆదోని 5, చాగలమర్రి 5, పాములపాడు 4, చిప్పగిరి 3, శిరివెళ్ల 3, గడివేముల 2, మహానంది 2, అవుకు 2, బేతంచెర్ల 1, డోన్ 1, ఆస్పరి 1, బండిఆత్మకూరు 1, గోనెగండ్ల 1, కల్లూరు 1, కృష్ణగిరి 1 ఓర్వకల్ 1, పగిడ్యాల 1, రుద్రవరం 1, సంజామల 1, తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన ఒకరికి పాజిటివ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 14 మంది కర్నూలు నగరానికి చెందిన వారు కాగా.. ఒకరు పాణ్యం, మరొకరు నంద్యాల పట్టణానికి చెందిన వారు ఉన్నారు. నంద్యాల ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటించింది.
ఇదీ చదవండి : మా నీటినే.. మేం వాడుకుంటాం: సీఎం జగన్