కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18 మందికి వైరస్ సోకింది. మహమ్మారి వల్ల ఈరోజు మరణాలేవీ సంభవించలేదని ప్రభుత్వం వెల్లడించింది.
కర్నూలులో తగ్గుతున్న కరోనా ఉద్ధృతి - నవంబర్ 17న కర్నూలులో కరోనా బాధితులు
కరోనా ఉద్ధృతి కర్నూలు జిల్లాలో తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ ధాటికి ఎవరూ మరణించలేదని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 250 మంది వైరస్ బాధితులు.. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.
![కర్నూలులో తగ్గుతున్న కరోనా ఉద్ధృతి kurnool covid bulletin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9572597-375-9572597-1605621080877.jpg)
కర్నూలు కరోనా బులెటిన్
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 59,972 మందికి కరోనా సోకగా.. 59,239 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 250 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 483 మంది మహమ్మారి ధాటికి మరణించారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.