కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపి తగ్గుతున్నాయి. జిల్లాలో మంగళవారం 33 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 59,791 మందికి కరోనా సోకగా.. 59,026 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 283 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వల్ల ఇప్పటివరకు 482 మంది చనిపోయారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.
కర్నూలు జిల్లాలో కరోనా తగ్గుముఖం - ఏపీ కరోనా న్యూస్
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు క్రమేపి తగ్గుతున్నాయి. జిల్లాలో ఇవాళ కొత్తగా 33 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకూ 59,791 మంది కరోనా బారిన పడగా...59,026 మంది కోలుకున్నారు.
corona cases