కర్నూలు జిల్లా(kurnool district) ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు(Adoni Market Yard)లో తూకందారులు, హమాలీల మధ్య వివాదం(controversy) నెలకొంది. పత్తి తూకంలో మోసం చేస్తున్నారని రైతులు ఆరోపణ చేయడంతో వాగ్వాదం జరిగింది. తూకాల మోసాలకు పాల్పడుతోంది తూకందారులనేని.. తమ ప్రమేయం లేదని హమాలీలు చెబుతున్నారు. ఇద్దరి మధ్య వివాదాన్ని యార్డు అధికారులు రాజీ చేశారు. ఘటనలో హమాలీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫలితంగా ఆగ్రహించిన కార్మిక సంఘాలు రేపటి నుంచి మార్కెట్ యార్డులో సమ్మెకు(strike) పిలుపునిచ్చారు. తమపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని హమాాలీలు డిమాండ్ చేశారు.
Adoni Market Yard: ఆదోని మార్కెట్ యార్డులో వివాదం
కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డు(Adoni Market Yard)లో ఉద్రిక్తత నెలకొంది. పత్తి తూకం విషయంలో తూకందారులు, హమాలీల మధ్య వివాదం జరిగింది. ఘటనలో హమాలీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫలితంగా ఆగ్రహించిన కార్మిక సంఘాలు రేపటి నుంచి మార్కెట్ యార్డులో సమ్మెకు పిలుపునిచ్చారు.
controversy