ముఖ్యమంత్రి జగన్...రేపు కర్నూలులో పర్యటించనున్న నేపథ్యంలో ఫ్లెక్సీల ఏర్పాటులో వైకాపా నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదంతో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ఎస్వీ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం రాత్రి నుంచి నగరపాలక సంస్థ అధికారులు తొలగిస్తున్నారు. కేవలం తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలనే తొలగిస్తుండటంతో ఆయన అనుచరులు నగరపాలక సంస్థ ట్రాక్టర్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది.
ఫ్లెక్సీల ఏర్పాటులో వివాదం - కర్నూలులో వైకాపా నాయకులు మధ్య ప్లేక్సీల వివాదం
కర్నూలులో రేపు ముఖ్యమంత్రి జగన్ పర్యటించున్న నేపథ్యంలో ఫ్లెక్సీల ఏర్పాటులో వైకాపా నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వర్గానికి చెందిన ఫ్లెక్సీలను కాదని ఎస్వీ మోహన్‌రెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగించటంతో ఘర్షణ తలెత్తింది.
ఫ్లెక్సీల ఏర్పాటులో వైకాపా నాయకుల మధ్య వివాదం