ప్రభుత్వ విద్యావ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్నూలులో నిరసన తెలిపారు. గత సంవత్సరం లాగానే 12 నెలలకు రెన్యూవల్ ఉత్తర్వులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 2020_21 విద్యా సంవత్సరానికి పది నెలలకే రెన్యూవల్ విడుదల చేశారని... ఈ విషయం పై విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు.
సీఎం జగన్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. నాలుగు నెలల నుంచి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని... పాదయాత్ర లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.