Constables Misbehave with Couples : ప్రెండ్లీ పోలీసింగ్ అని పోలీస్ అధికారులు అంటుంటే.. కొందరి దురుసుతనం వల్ల పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తోంది. ప్రజల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా మసలుకొవాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఆచరణలో కొందరు పోలీసుల తీరు మాత్రం ప్రజలతో దురుసుగానే ఉంటోంది.
కర్నూలు జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు దంపతులతో ప్రవర్తించిన తీరు.. పోలీసులు అంటేనే ప్రజలు విసుక్కునేలా ఉంది. ఆదోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సమీపంలో వాహన చోదకుల నుంచి పెండింగ్లో ఉన్న ఈ-చలానా వసూళ్లను పోలీసులు చేపట్టారు. ఈ క్రమంలో దంపతులు చాలానాలు వసూలు చేస్తున్న ప్రదేశానికి ద్విచక్ర వాహనంపై వచ్చారు.