అనుమానస్పద స్థితిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. పోలీసు శాఖలో వీఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సోమభూపాల్... విధులు ముగించుకొని మూడు గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు గల కారణాలుగా భావిస్తున్నారు. ఘటనపై తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి - అనుమానస్పదస్థితిలో కానిస్టేబుల్ మృతి
కర్నూలులో వీఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అనుమానస్పదస్థితిలో కానిస్టేబుల్ మృతి