రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధానిని దొనకొండకు మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఎంతోమంది ప్రజలు రాజధాని అమరావతి కోసం భూములిచ్చారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని సీఎం జగన్, మంత్రి బొత్స విస్మరిస్తున్నారన్నారు. తమ నాయకుడు చంద్రబాబును టార్గెట్ చేయటమే పనిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. జిల్లాలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉన్నా...జిల్లా ఇన్చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించకపోవటం దారుణమన్నారు.
'రియల్ ఎస్టేట్ కోసమే.. రాజధాని మార్పునకు కుట్ర' - change capital for real estate
స్వలాభం కోసమే ప్రభుత్వం రాజధానిని మార్చడానికి కుట్ర చేస్తుందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి విమర్శించారు. రాజధాని అంశంపై మంత్రి బొత్స చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించకపోవటం దారుణమన్నారు.
జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి