రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా దొడ్డి దారిలో పాలన కొనసాగిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. కర్నూలుకు వచ్చిన ఆయన ద్రవ్య వినిమయ బిల్లును శాసన మండలిలో ఆమోదించుకోలేక గవర్నర్‌తో ఆమోదింపచేయడం దారుణమని విమర్శించారు. ఏదైనా విషయాలు ప్రభుత్వానికి తెలియజేయాలన్నా వినే పరిస్థితుల్లో లేదన్నారు. కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న ప్రతీ కుటుంబానికి ఏడు నుంచి పది వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం దొడ్డిదారి పాలన సాగిస్తోంది: శైలజానాథ్
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల బాధ్యతలను ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకులకు అప్పగించడం దారుణమని, ఇతర సామాజిక వర్గాలు ఎందుకు కనిపించలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శైలజానాథ్ ధ్వజమెత్తారు. కర్నూలుకు వచ్చిన ఆయన వైకాపా పాలనపై విమర్శలు గుప్పించారు.
కర్నూలులో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శైలజానాథ్