రాష్ట్రానికి ప్రత్యేక హోదా మన హక్కే కానీ.. భిక్షకాదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శైలజానాథ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రాన్ని హోదా అడగడంలో సీఎం జగన్ వెనకాడుతున్నారని తెలిపారు. దళితులు,పేదల వ్యతిరేకిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వేలకోట్లు అప్పులు చేయడంతో ఏపీ పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కర్లేదన్నారు. జగన్ ప్రతీకార ధోరణి వీడి ప్రగతి వైపు పయనించాలని హితవుపలికారు.
'సీఎం ప్రతీకార ధోరణి వీడి.. ప్రగతి వైపు నడవాలి':శైలజానాథ్ - ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వార్తలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను అడిగేందుకు సీఎం జగన్ వెనకాడుతున్నారని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ఆరోపించారు. దళితులు,పేదల వ్యతిరేకిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని తెలిపారు.
congress-ap-pcc