ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 17, 2022, 4:09 PM IST

ETV Bharat / state

రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు.. 15 మందికి గాయాలు!

హన్​మాన్ జయంతి వేడుకల ఊరేగింపులో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటనలో 15 మంది గాయాల పాలయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా హోళగుందలో చోటుచేసుకుంది. దీంతో.. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు
రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు

రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు

కర్నూలు జిల్లా హోళగుందలో శనివారం రాత్రి నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది. ఊరేగింపు జరుగుతున్న క్రమంలో ఓ వర్గం వారు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 15 మందికిపైగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన సమయంలో ఆలూరు సీఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే బందోబస్తులో ఉన్నట్లు తెలిసింది.

ఘటన జరిగిన వెంటనే సమీప ఠాణాల నుంచి వచ్చిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ అక్కడికి వెళ్లి రాత్రి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం రెండు వర్గాలను సమావేశ పరచి సమస్యను పరిష్కరించాలని చూశారు. ఆ సమయంలో ఎస్పీ ఎదుటే మరోసారి రాళ్లు విసురుకున్నారు. దీంతో.. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు.

ఇదీ చదవండి: Nellore Theft Case: కోర్టు దొంగతనం కేసులో పురోగతి.. ఇద్దరు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details