కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. దారి విషయంలో జరిగిన ఈ గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన చిన్నన్న అనే వ్యక్తి... బాలేశ్వరాచారి అనే మరో వ్యక్తి తలపై దాడి చేయగా.. బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలేశ్వరాచారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
conflict: ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఒకరికి గాయాలు - కర్నూలు జిల్లా క్రైం
కర్నూలు జిల్లా గోపవరంలో ఇరుకుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ (conflict) ఉద్రిక్తతకు దారి తీసింది. పరస్పరం దాడి చేసుకోవడంతో ఒకరికి గాయాలయ్యాయి.
ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఒకరికి గాయాలు