ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్యాస్​కు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్థుల ఆందోళన

గ్యాస్ సిలిండర్ రవాణాకు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కర్నూలు జిల్లా ధణపురం గ్రామస్థులు ఆందోళన చేశారు. రశీదు ఇవ్వకుండా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోయారు.

Concerns in Dhanapuram that excessive money is being collected
అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ధణపురంలో ఆందోళన

By

Published : Apr 1, 2020, 1:31 PM IST

అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ధణపురంలో ఆందోళన

వంటగ్యాస్ సిలిండర్ రవాణాకు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కర్నూలు జిల్లా ఆదోని మండలం ధణపురం గ్రామస్థులు ధర్నా చేశారు. ఆదోని పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ గ్రామంలో ఒక్కో సిలిండర్​కు 60 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారని నిరసన చేపట్టారు. రశీదు ఇవ్వకుండా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నా... రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వీఆర్వో జోక్యం చేసుకొని గ్యాస్ ఏజెన్సీస్ తో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details