కర్నూలు జిల్లా ఆదోని పురపాలక కార్యాలయంలోని టీడ్కో అధికారి ఎదుట లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల పట్టల జాబితాలో పేర్లు ఉన్నాగానీ పట్టాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో పురపాలక టీడ్కో అధికారి ఎదుట నిరసన తెలిపారు. టీడ్కో అధికారి వచ్చిన వారి పట్ల దురుసుగా మాట్లాడంతో లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిపై కమిషనర్ కృష్ణకు ఫిర్యాదు చేశారు. దురుసుగా వ్యవహరిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిషనర్ వారికి నచ్చజెప్పి టిడ్కో అధికారిని పిలిపించి మందలించారు.
టీడ్కో అధికారి ఎదుటు ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన - Concern of home beneficiaries at Tidco officer in Adoni
కర్నూలు జిల్లా ఆదోని పురపాలక కార్యాలయంలో టీడ్కో అధికారి ఎదుట లబ్దిదారులు ఆందోళనకు దిగారు. ఇళ్ల పట్టల జాబితలో వారి పేర్లు ఉన్నాగానీ పట్టాలు ఇవ్వకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదోనిలో టీడ్కో అధికారి వద్ద ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన