మద్దికెర రైల్వే బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ కర్నూలు జిల్లా మద్దికెరలో.. మెులగవల్లి తదతర గ్రామాలకు చెందిన రైతులు రహదారిపై ఎడ్లబండ్లను అడ్డుగా పెట్టి నిరసనకు దిగారు. రైల్వే అధికారులు కనీసం రాకపోకలు నిర్వహించేందుకు బ్రిడ్జి నిర్మించకుండా రైల్వే పనులు చేపట్టడంపై స్థానిక బస్స్టాండ్ ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.
మద్దికెర రైల్వే బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ రైతుల ఆందోళన - farmers protest in kurnool district
మద్దికెర రైల్వే బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ...కర్నూలు జిల్లా మద్దికెరలో రైతులు ఆందోళనకు దిగారు. రాకపోకలు నిర్వహించేందుకు బ్రిడ్జి నిర్మించకుండా రైల్వే అధికారులు పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్దికెర రైల్వే బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ రైతుల ఆందోళన
వేలాది ఎకరాల పొలాలకు రాకపోకలు సాగించడానికి వీలులేకుండా రైతులు ఇబ్బందులు పడుతుంటే, రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు.. రాత్రికి రాత్రే పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దికెర వద్ద కొత్త బ్రిడ్జి నిర్మించేదాకా ఆందోళన ఆపమని పనులను జరగనివ్వమని హెచ్చరించారు.