Argument with police at subjail: పోలీసులు చితకబాదారని సబ్ జైలు ఎదుట బాధితుడి బంధువులు ఆందోళనకు దిగిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటు చేసుకుంది. నాటు సారా కేసులో ఆరెస్టై రిమాండ్‌లో ఉన్న పాండురంగడు అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్‌కు తీసుకురాగా సీఐ చితకబాదాడంటూ నిందితుడి తరపు బంధువులు సబ్ జైలు వద్ద ఆందోళనకు దిగారు. జడ్జి ఇంటి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐని పిలిపించి జడ్జి వివరణ కోరినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. జైలు వద్ద పోలీసులకు నిందితుడి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.
రిమాండ్‌లో ఉన్న వ్యక్తిని పోలీసులు కొట్టారంటూ బంధువుల ఆందోళన.. జడ్జికి ఫిర్యాదు - relatives accused protested in front of sub jail
Argument with police at subjail: నాటు సారా కేసులో ఆరెస్టై రిమాండ్‌లో ఉన్న వ్యక్తిని పోలీసులు కొట్టారంటూ కర్నూలు జిల్లా పత్తికొండలో బంధువులు ఆందోళనకు దిగారు. సబ్‌జైల్ వద్దకు చేరి పోలీసులతో వాగ్వాదానికి దిగి.. ఆ తర్వాత జడ్జి ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
Argument with police at subjail