ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్ని పార్టీలు ఐకమత్యంతో ఉద్యమించాలి' - కర్నూలు తాజా సమాచారం

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కర్నూలు గాయత్రీ ఎస్టేట్​లో తెదేపా శ్రేణులు నిరసన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అన్ని పార్టీలు ఐకమత్యంతో ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

Concern in Kurnool against the decision to privatize the Visakhapatnam steel plant
'అన్ని పార్టీలు ఐకమత్యంతో ఉద్యమించాలి'

By

Published : Feb 18, 2021, 3:45 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు అధికార వైకాపా కలిసిరావాలని.. తెదేపా నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు కర్నూలు గాయత్రీ ఎస్టేట్​లో నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం అన్ని పార్టీలు ఐకమత్యంతో.. ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెదేపా కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న పరిశ్రమను.. ప్రైవేట్ ప​రం కాకుండా అడ్డుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details