ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అట్రాసిటీ కేసు నమోదు చేయలేదని డీఎస్పీపై ఫిర్యాదు - compliant against adoni dsp vinod kumar

కర్నూలు జిల్లా ఆదోని డీఎస్పీ వినోద్​ కుమార్​పై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. గత నెలలో హోలాగుంద, ఎమ్మిగనూరులో దళితులపై దాడి ఘటనలో.. అట్రాసిటీ కేసు నమోదు చేయలేదని బాధితులు ఆరోపించారు. డీఎస్పీ వినోద్ కుమార్​పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

leaders
నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నేతలు

By

Published : Aug 4, 2021, 8:10 PM IST

కర్నూలు జిల్లా ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్​పై కేసు నమోదు చేయాలని రెండో పట్టణ పోలీస్ స్టేషన్​లో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్, బహుజన ఐక్యవేదిక బాధితులు ఫిర్యాదు చేశారు. గత నెలలో డివిజన్ పరిధిలోని ఎమ్మిగనూరు, హోలాగుంద మండలంలో దళితులపై దాడి కేసు విషయంలో అట్రాసిటీ నమోదు చేయలేదని డీఎస్పీపై ఆరోపణలు చేశారు.

హోలాగుంద, ఎమ్మిగనూరులో దళితులపై దాడి చేసిన సమయంలో స్టేషన్లకు వెళ్లిన ఫలితం లేదని ఆందోళన చెందారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. డీఎస్పీ వినోద్ కుమార్​పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details