ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రేపట్నుంచి ఆదోనిలో పూర్తి లాక్ డౌన్ '

కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదివారం నుంచి పూర్తిస్థాయి లాక్ డౌన్ ఉంటుందని ఆర్డీవో బాలగణేశయ్య తెలిపారు.పట్టణంలో ఇప్పటికే 137 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న ఆయన...కేసులు ఇంకా పెరగకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

complete lockdown in kurnool dst adoni  due to increasing corona cases
complete lockdown in kurnool dst adoni due to increasing corona cases

By

Published : Jun 13, 2020, 10:21 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదివారం నుంచి పూర్తిస్థాయి లాక్ డౌన్ కొనసాగుతుందని ఆర్డీఓ బాలగణేశయ్య తెలిపారు. పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల కారణంగా.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఆదోనిలో ప్రస్తుతం 137 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. పట్టణంలో ఉదయం 6 నుంచి 9 వరకు లాక్ డౌన్ సడలింపు ఉంటుందని వెల్లడించారు. నిత్యావసర వస్తువులు, పాలు, పండ్లు, వ్యవసాయ పనులకు ఉపయోగించే వస్తువుల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.

ఇదీ చూడండికరోనా పట్ల అప్రమత్తంగా అమెరికన్లు... కానీ...'

ABOUT THE AUTHOR

...view details