Fake Challan: నంద్యాలలో నకిలీ చలానాల కుంభకోణం.. నలుగురిపై కేసు
15:18 August 14
నకిలీ చలానాల కుంభకోణంపై పోలీసులకు ఫిర్యాదు
కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కుంభకోణంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అవకతవకలకు పాల్పడిన నలుగురు డాక్యుమెంట్ రైటర్లపై జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మురళీసుందర్‌రావు ఫిర్యాదు చేశారు. 54 డాక్యుమెంట్లకు సంబంధించి రూ. 7.40 లక్షల గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు డాక్యుమెంట్ రైటర్లు మున్నార్, అస్లామ్ బాషా, ఫైరజ్‌తో పాటు మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
మంగళగిరిలో మాత్రమే నకిలీ చలానాల అక్రమాలు: రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ