కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. మాస్కు లేకుండా ఎవరైనా బయటికి వస్తే 200 రూపాయలు జరిమాన విధిస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ బాలాజీ హెచ్చరించారు. కరోనా పూర్తిగా లేనట్లు ప్రజలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్లో సడలింపులు ఉన్నందున ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని ఆయన కోరారు. షాపుల వద్ద వినియోగదారులు భౌతిక దూరం పాటించే విధంగా యజమానులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
మాస్కులు లేకుండా బయటికి వస్తే రూ.200 జరిమానా - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు నగరంలో మాస్కులు లేకుండా బయటికి వస్తే 200 రూపాయలు జరిమానా విధిస్తామని నగర పాలక కమిషనర్ తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
mask news