కర్నూలు జిల్లాలోని నంద్యాలలో జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి భవన సముదాయాలను అధికారులు పరిశీలించారు. జిల్లా పాలనాధికారి వీర పాండ్యన్ సహా ఎస్పీ పకీరప్ప, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాణ్యం మండలంలోని జీఎం కళాశాల భవనాలు, నూలు మిల్లు ప్రాంతాన్ని సందర్శించారు. త్వరలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నందున కార్యాలయాల కోసం భవనాలు పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పాణ్యంలో భవనాలను పరిశీలించిన కలెక్టర్ - Establishment of district offices news
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా కర్నూలులోని నంద్యాలలో కార్యాలయాల ఏర్పాటుకు పలు భవనాలను అధికారులు పరిశీలించారు.
భవనాలను పరిశీలిస్తున్న అధికారులు