కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 ల్యాబ్‌ను కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఈ ల్యాబ్ ద్వారా రోజుకి వెయ్యి మందికి వైద్య పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు. ప్రజలందరూ సహకరించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కరోనా ప్రాణాంతకం కాదనీ, ఎవ్వరూ భయపడవద్దన్నారు.
'సహకరించి పరీక్షలు చేయించుకోండి' - collector visit covid 19 testing lab in kurnool
జిల్లా ప్రజలు కరోనా పరీక్షలు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పరీక్షలు చేయించుకునేందుకు ఎవరూ భయపడవద్దని భరోసా ఇచ్చారు.
కరోనా ల్యాబ్‌ను పరిశీలించిన కలెక్టర్