ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తుంగభద్ర పుష్కరాలకు ఆన్​లైన్​లో పేర్లు నమోదు చేసుకోవాలి' - Tungabadhra Pushkaaralu news today

కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళిగనూరు వద్ద తుంగభద్ర నది పుష్కరాల ఘాట్​లో కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ ఫక్కీరప్ప పర్యటించారు. పుష్కరాలకు 12 నుంచి 50 లోపు వారికే అనుమతి ఉంటుందని.. ముందస్తుగానే అన్‌లైన్లో పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

'తుంగభద్ర పుష్కరాలకు ఆన్​లైన్ దరఖాస్తు చేసుకున్నవారికే అనుమతి'
'తుంగభద్ర పుష్కరాలకు ఆన్​లైన్ దరఖాస్తు చేసుకున్నవారికే అనుమతి'

By

Published : Oct 6, 2020, 5:51 PM IST

కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళిగనూరు గ్రామం వద్ద తుంగభద్ర నది పుష్కరాల ఏర్పాట్లను కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ ఫక్కీరప్ప పరీశిలించారు. అనంతరం అన్ని శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాల్లో జనం వేలాదిగా ఒకేసారి తరలిరాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆ వయసు వారికే అనుమతి..

మౌలిక సౌకర్యాలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. పుష్కరాలకు 12 నుంచి 50 సంవత్సరాలలోపు వారికే అనుమతి ఉంటుందని కలెక్టర్ వివరించారు. పుష్కర స్నానాల కోసం ముందస్తుగానే అన్‌లైన్లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

వారికే అవకాశం..

రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అనంతరం కంబళనూరు గ్రామ సచివాలయాన్ని ఎస్పీ ఫకీరప్పతో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో వివిధ జిల్లా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

--

ఇవీ చూడండి:

కర్ణాటకలో పర్మిట్ లేని ఆరెంజ్​ బస్సులు సీజ్

ABOUT THE AUTHOR

...view details