కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీలో గ్యాస్ లీకేజీ ప్రమాదాన్ని సమన్వయంతో అరికట్టిన అధికారులను కలెక్టర్ వీరపాండియన్ అభినందించారు. పెను ప్రమాదం నుంచి ప్రజలను కాపాడిన అగ్నిమాపక శాఖ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పోలీస్, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీస్ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి, సంక్షేమ శాఖ జేసీ సయ్యద్ ఖాజా మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీవై ఆగ్రోస్ గ్యాస్ లీకేజీ ఘటన: సిబ్బందిని అభినందించిన కలెక్టర్ - SPY Agros Industry news update
ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీలో గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రజలను కాపాడిన అగ్నిమాపక శాఖ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పోలీస్, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీస్ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ వీరపాండియన్ అభినందించారు.
గ్యాస్ లీకేజీ ఘటనలో సమన్వయంతో పనిచేసిన సిబ్బందిని అభినందించిన కలెక్టర్