ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెండింగ్​ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ - కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తాజా వార్తలు

తుంగభద్ర పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో చేపట్టన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఆధికారులను కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ఆదేశించారు. నిర్మిస్తున్న పుష్కర ఘాట్లను జిల్లా ఎస్పీతో కలిసి ఆయన పరిశీలించారు.

collector veera pandiyan visit pushkara ghat works
పెండింగ్​లో ఉన్న పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

By

Published : Nov 15, 2020, 4:00 PM IST

పెండింగ్​లో ఉన్న పనుల్లో వేగం పెంచాలని ఆధికారులను కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ఆదేశించారు. తుంగభద్ర పుష్కరాల నేపథ్యంలో నగరంలో నూతనంగా నిర్మిస్తున్న ఘాట్లను జిల్లా ఎస్పీతో కలిసి పరిశీలించారు. రెండు రోజుల్లో పూర్తిస్ధాయిలో పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్బంగా మాస మసీదు దగ్గర ఉన్న పంప్ హౌస్ ఘాట్, సంకల్ భాగ్ ఘాట్, వన్ టౌన్​లోని రాఘవేంద్ర మఠం ఘాట్, ఎపీఎస్పీ బెటాలియన్​లోని హెలిప్యాడ్​లనూ పరిశీలించారు. బారీకేడింగ్, కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీఐపీ ఘాట్ల రూట్​ను పరిశీలించిన ఆనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details