హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారందరినీ ఆసుపత్రికి తరలిస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ ప్రకటన చేయడం సరికాదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆమె నిలదీశారు.
ప్రజల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు అధికారులు తీసుకోవటం తగదని భూమా అఖిల ప్రియ అన్నారు. అధికారులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే అధికార పార్టీ నేతలు మౌనం వహించడం తగదని చెెప్పారు.