కర్నూలు జిల్లాలో రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి జిల్లాలోని పోలింగ్ సరళిని కలెక్టర్ వీర పాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప పర్యవేక్షిస్తున్నారు. వెబ్ కాస్టింగ్, పోలీసు వైర్ లెస్ సెట్స్, మీడియా చానెల్స్ ద్వారా 19 నోడల్ కమిటీల అధికారులు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ - kurnool collector veera pandyan news
కర్నూలు జిల్లాలో రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని జిల్లా పాలనాధికారి, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.
పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ
నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో 13 మండలాల్లోని 240 పంచాయతీలు, 2,482 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 57 సర్పంచి, 933 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 183 సర్పంచి, 1,549 వార్డు స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. సర్పంచి స్థానాలకు 519, వార్డులకు 3,496 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలకు 6 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. 1,964 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.