ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహానందిలో మోసం... కొబ్బరికాయ ధరకు రెక్కలు! - మహానందిలో అధిక ధరలకు కొబ్బరికాయల అమ్మకం

మహానంది క్షేత్రంలో కొబ్బరికాయ ధరలకు రెక్కలు వచ్చాయి. బయట రూ.20లకు లభించే కొబ్బరికాయ అక్కడ రూ.50లకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. గమనించిన మాజీ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు.

కొబ్బరికాయ

By

Published : Nov 11, 2019, 10:09 AM IST

అధికారులను, వ్యాపారులను ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో భక్తులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. రూ.25లకు అమ్మాల్సిన కొబ్బరికాయను రూ. 40 నుంచి రూ.50లకు విక్రయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పూలు, అగరబత్తీలు సహా వసూలు చేస్తున్నామని సమాధానమిస్తున్నారు. ఇతర పూజా సామగ్రి అవసరం లేకుండా కేవలం కొబ్బరికాయ ఇవ్వండి అంటే కుదరదు అంటున్నారు. పరిస్థితిని గమనించిన శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యాపారులను నిలదీశారు. టెండర్ ప్రమాణాలకు విరుద్ధంగా కొబ్బరికాయలు విక్రయించేందుకు ఎలా అనుమతిచ్చారంటూ అధికారులపై మండిపడ్డారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details