దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 71వ జయంతిని కర్నూల్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వైఎస్ఆర్ కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి శాసనసభ్యుడు హఫీజ్ ఖాన్ పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయ సాధన కోసమే వైకాపా పుట్టిందని ఎమ్మెల్యే అన్నారు.
కర్నూలు జిల్లాలో ఘనంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి - వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు వార్తలు
కర్నూల్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కర్నూలు జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు
ఎమ్మిగనూరులో దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతిని వైకాపా నాయకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి... నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు.
ఇదీ చదవండి: అచ్చెన్నాయుడు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి
TAGGED:
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి