ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనెల 18న కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన - కర్నూలు జిల్లా తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఈ నెల18న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించిన తరువాత సీఎం జిల్లాకు రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించారు.

CM jagan kurnool tour
CM jagan kurnool tour

By

Published : Feb 15, 2020, 6:23 PM IST

సీెఎం పర్యటన వివరాలు వెల్లడిస్తున్న మంత్రి అనిల్

కర్నూలు జిల్లాలో ఈ నెల 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్‌రెడ్డిపర్యటించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్ యాదవ్ వెల్లడించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిబుగ్గన రాజేంథ్రనాథ్​రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో కలిసి పరిశీలించారు. మొదట కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం సభ నిర్వహించే కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానానికి మంత్రులు చేరుకౌని ఏర్పాట్లను పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details