ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు ఓర్వకల్లుకు సీఎం జగన్.. ఐఆర్​ఈపీ ప్రాజెక్టును పరిశీలించనున్న జగన్​

CM Jagan kurnool Tour: నేడు ముఖ్యమంత్రి జగన్.. కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఓర్వకల్లు పరిధిలో చేపట్టిన ఐఆర్​ఈపీ ప్రాజెక్టును జగన్​ పరిశీలించనున్నారు.

సీఎం జగన్
సీఎం జగన్

By

Published : May 16, 2022, 10:07 PM IST

Updated : May 17, 2022, 3:10 AM IST

ముఖ్యమంత్రి జగన్.. నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు మండలం గుమ్మటంతండా వద్ద ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సీఎం పరిశీలించనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒకేచోట సౌర, పవన, జలవిద్యుత్ ఉత్పత్తికి గ్రీన్‌కో సంస్థ అడుగులు వేస్తోంది. 3వేల మెగావాట్ల సౌర విద్యుత్, 550 మెగావాట్ల పవన విద్యుత్‌తోపాటు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ద్వారా 16వందల 80 మెగావాట్లు కలిపి మొత్తం 5వేల 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఐఆర్​ఈపీ(IREP)కి గత ప్రభుత్వ హయాంలో బీజం పడింది. గ్రీన్‌కో సంస్థకు ఆమోదం తెలపడంతో ప్రజాభిప్రాయ సేకరణ వరకు పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో ఏడాది జాప్యమైంది. ఆ తర్వాత 2020లో కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది.

ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడనుంచి గుమ్మటం తండ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు..గ్రీన్‌కోకు సీఎం చేరుకుంటారు. ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు పరిశీలన అనంతరం తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లికి వెళ్తారు.

ఇదీ చదవండి:పరిహారం దక్కని ఒక్క రైతునూ.. దత్తపుత్రుడు చూపలేదు : జగన్

Last Updated : May 17, 2022, 3:10 AM IST

ABOUT THE AUTHOR

...view details