ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు.. - సీఎం జగన్ శ్రీశైలం పర్యటనపై వార్తలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం పర్యటన రద్దైంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం నేపథ్యంలో పర్యటన విరమించుకున్నారు. ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

cm jagan srisailam tour cancelled
సీఎం శ్రీశైలం పర్యటన రద్దు

By

Published : Aug 21, 2020, 10:35 AM IST

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం నేపథ్యంలో సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దయింది. తెలంగాణ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోపల చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రణాళిక ప్రకారం ఇవాళ సీఎం రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టుల పరిశీలనకు శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా.. ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించి పూజలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఐతే తెలంగాణ పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్నిసీఎంవో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడకు వెళ్లి పూజలు, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సరికాదని సీఎం పర్యటన రద్దు చేసుకున్నారు.

ఇదీ చదవండి: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. చిక్కుకున్న 9 మంది

ABOUT THE AUTHOR

...view details