ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM JAGAN SERIOUS: రహదారి వెంట దుర్వాసన.. ముఖ్యమంత్రి సీరియస్

జాతీయ రహదారి వెంట తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుండడం.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఆగ్రహం తెప్పించింది. వాసనతోపాటు వీధి దీపాలు వెలగకపోవడంపైనా.. తన కార్యాలయం అధికారులతో మాట్లాడారు. సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

cm-jagan-serious-on-stink-along-the-national-highway
జాతీయ రహదారి వెంట దుర్వాసనపై సీఎం సీరియస్

By

Published : Nov 16, 2021, 10:42 AM IST

జాతీయ రహదారి వెంట తీవ్రమైన దుర్వాసన వెదజల్లడంపై.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల కిందట గన్నవరం విమానాశ్రయం నుంచి వస్తుండగా.. విజయవాడలోని ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు ప్రాంతాల్లో విపరీతమైన దర్వాసన వచ్చింది. ఈ విషయమై వెంటనే సీఎం తన కార్యాలయం అధికారులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవో నుంచి సచివాలయం అధికారులకు.. అక్కడి నుంచి కృష్ణా జిల్లా కలెక్టరుకు ఆదేశాలు చేరాయి.

వెంటనే ఉన్నతాధికారుల బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. ఆటోనగర్‌ నుంచి వచ్చే మురుగు ప్రసాదంపాడు, ఎనికేపాడులో నిల్వ ఉంటోందని గమనించిన అధికారులు.. పక్కా డ్రైనేజీ నిర్మించాలని ప్రతిపాదించారు. జాతీయ రహదారికి రాకుండా ఆటోనగర్‌ నుంచి నిడమానూరు మీదుగా మురుగునీటిని మళ్లించాలని తెలిపారు. ఆటోనగర్‌ వద్ద పరిశ్రమల నుంచి వచ్చే మురుగునీటిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

జాతీయరహదారి వెంట వీధిదీపాలు వెలగకపోవడంపై సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం, గవర్నర్‌, కేంద్ర మంత్రులు విమానాశ్రయం నుంచి నగరం మీదుగా సచివాలయం, ఇతర ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉన్నందున.. వీధి దీపాలు, మురుగు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచనలు చేశారు.

ఇదీ చూడండి:యువతికి నిప్పంటించిన ఉన్మాది.. హర్షవర్దన్‌ మృతి

ABOUT THE AUTHOR

...view details