CM Jagan meets Alur constituency activists: మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని.. ప్రజల్లో తిరుగుతూ సమస్యలు పరిష్కరించాలని నేతలు, కార్యకర్తలకు సీఎం జగన్ నిర్దేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఇంటింటికీ వెళ్లి ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దాలని సూచించారు. మనం అంతా కలిసికట్టుగా ఒక్కటి కావాలని..అప్పుడే విజయాలు నమోదు చేస్తామని.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన సీఎం జగన్ చెప్పారు. ఒక్క ఆలూరు నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా ఈ మూడు ఏళ్ల కాలంలో లబ్ధిదారులకు 1050కోట్ల రూపాయలను.. వారి ఖాతాల్లో వేశామని సీఎం తెలిపారు.
ప్రజల్లో తిరగాలి... సమస్యలు పరిష్కరించాలి.. ఆలూరు కార్యకర్తలతో సీఎం జగన్ - CM Jagan meets Alur constituency activists
CM Jagan meeting: ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఈరోజు వారితో సమావేశమైన ఆయన.. 19 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని... గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఇంటింటికి వెళ్లి పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని తెలిపారు.
jagan with alur leaders