ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన - నంద్యాలలో వైద్య కళాశాల శంకుస్థాపన

కర్నూలు జిల్లా నంద్యాలలో వైద్య కళాశాల నిర్మాణానికి సీఎం జగన్ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

nandyala
నంద్యాలలో వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

By

Published : May 31, 2021, 7:02 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో వైద్య కళాశాల నిర్మాణానికి సీఎం జగన్​ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ శిలా ఫలకాన్ని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ, పాణ్యం ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రనాథరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ మనిజర్ జిలాని సామున్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details