కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. సంకల్‌బాగ్ పుష్కర ఘాట్ వద్ద సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమంలో పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. కర్నూలు నియోజకవర్గంలో 7, కోడుమూరు నియోజకవర్గంలో 5, మంత్రాలయం నియోజకవర్గంలో 8, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 2 ఘాట్లను సిద్ధం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఒక ఘాట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
సంకల్‌బాగ్ ఘాట్లో పుష్కరాలు ప్రారంభించిన సీఎం జగన్
కర్నూలు నగరంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్లో తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సంప్రదాయ దుస్తులతో తుంగభద్రమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
cm-jagan