కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్స్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సీఎం ఆస్పత్రిని ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన ఈ ఆస్పత్రి వల్ల ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు సీఎం వ్యాఖ్యానించారు. అనంతరం ఆస్పత్రి డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నంద్యాల నుంచి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ బ్రహ్మానంద రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
ఉదయానంద హాస్పిటల్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్ - ఉదయానంద హాస్పిటల్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్
కర్నూలు జిల్లాలోని ఉదయానంద హాస్పిటల్స్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఈ ఆస్పత్రి వల్ల ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
cm jagan
TAGGED:
సీఎం జగన్ తాజా వార్తలు