ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: జగన్ - కర్నూలు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం జగన్ పరిహారం వార్తలు

మంగళవారం కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.

కర్నూలు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం: జగన్
కర్నూలు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం: జగన్

By

Published : Dec 16, 2020, 4:33 PM IST

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం జగన్ రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించాలన్నారు. క్షతగాత్రుల చికిత్స ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ వీరపాండియన్‌కు ఫోన్ చేసి చెప్పారు.

ఏం జరిగిందంటే..?

మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులతో పాటు మహిళ మృతి చెందింది. శిరివెళ్ల మండలం జాతీయ రహదారిపై యర్రగుంట్ల వద్ద ఉదయం నాలుగున్నర సమయంలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం స్థానికంగా పెను విషాదం నింపింది. సుమారు 20 మంది రహదారి దాటేందుకు వేచి ఉండగా.. హఠాత్తుగా ఓ మినీ లారీ వారిపైకి దూసుకెళ్లింది.

ఇదీ చదవండి:నమ్మి భూములిస్తే... నట్టేట ముంచుతారా?

ABOUT THE AUTHOR

...view details