ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనకు వచ్చిన సందర్భంగా... హెలీకాప్టర్ ల్యాండింగ్ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన ఘటనపై... దర్యాప్తు ప్రారంభమైంది. సెప్టెంబర్ 21న సీఎం జగన్ మోహన్ రెడ్డి... నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో... వరద ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ల్యాండ్ కావాల్సి ఉండగా... 5 నిముషాలు జాప్యం జరిగింది. హెలీకాప్టర్ ల్యాండ్ అవ్వటానికి సంబంధించి కేవలం డిగ్రీల్లోనే నివేదికలిచ్చారు. దీనిపై సీఎం కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణాధికారిగా నియమితులైన డీఆర్వో వెంకటేశం... ఏడుగురు అధికారులకు తాఖీదులు జారీ చేశారు. వీరిలో... సర్వే మరియు ల్యాండ్ రికార్డుల ఏడీ హరికృష్ణ, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య హాజరు కాలేదు. శిరివెళ్ల, నంద్యాల, ఉయ్యాలవాడ తహసీల్దార్లు నాగరాజు, రమేష్ బాబు, నాగేశ్వరరెడ్డి, గోస్పాడు ఎంపీడీఓ సుగుణశ్రీ, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ వేణు హాజరయ్యారు.
సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ ఘటనపై... దర్యాప్తు ప్రారంభం - CM helicopter landing trial ... Two officers absent
సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో... తప్పుడు సమాచారమిచ్చిన ఘటనపై.... ఏడుగురు అధికారులకు తాఖీదులు జారీ చేశారు. ఇందులో నేడు విచారణకు ఇద్దరు గైర్హాజరయ్యారు.
![సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ ఘటనపై... దర్యాప్తు ప్రారంభం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4605779-623-4605779-1569858562367.jpg)
సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ ఘటనపై... దర్యాప్తు ప్రారంభం
సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ ఘటనపై... దర్యాప్తు ప్రారంభం