కర్నూలులో ప్రశాంతంగా లాక్డౌన్ - కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్డౌన్
కర్నూలులో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రద్దీగా ఉండే రైతు బజార్ల వద్ద అధికారులు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్డౌన్
కర్నూలులో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటికి వచ్చారు. ద్విచక్ర వాహనాల పై ఇద్దరు ప్రయాణిస్తే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. నగరంలో తిరుగుతున్న ఆటోలను సీజ్ చేస్తున్నారు. రద్దీగా ఉండే రైతు బజార్ల వద్ద అధికారులు సామాజిక దూరం పాటించే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టారు.