కర్నూలులో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నగర వీధుల్లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో క్రిమిసంహారక మందును పిచికారి చేస్తున్నారు. లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి నగరానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి భోజన సదుపాయం కల్పించారు.
కర్నూలులో ప్రశాంతంగా లాక్డౌన్
రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు కేవలం కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. ఈ ఘటనతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వీధుల్లోకి ఎవరూ రాకుండా లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. కర్నూలు నగరంలో రహదారులపై జన సంచారం లేకపోవడంతో నగరం నిర్మానుష్యంగా మారింది.
కర్నూలులో ప్రశాంతంగా లాక్డౌన్