Clay Ganesha Idol: కర్నూలులో శ్రీలక్ష్మి నరసింహ వినాయక బృందం ఆధ్వర్యంలో 55 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ వినాయకుడ్ని మండపం వద్దే నిమజ్జనం చేయనున్నారు. గణపతి విగ్రహం మట్టితో తయారు చేసింది కావడం వల్ల.. ఆగ్నిమాపక యత్రం సహాయంతో మండపం వద్దనే కరిగించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. కర్నూలులోని పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ వినాయకుడ్ని 11 రోజుల తర్వాత నిమజ్జనం చేయనున్నారు.
భారీ మట్టి గణపతి.. ఎవరు చేయని తీరుగా నిమజ్జనం..
Clay Ganesha Idol కర్నూలులో 55 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. మట్టి విగ్రహం ఏర్పాటు ఒక ప్రత్యేకత అంటే.. ఎవరు చేయని విధంగా నిమజ్జనం చేయడం మరో ప్రత్యేకత. ఇంతకీ నిమజ్జనం ఎలా చేశారంటే..
భారీ మట్టి గణపతి
"మేము ఏర్పాటు చేసిన ఈ గణపతి దర్శించుకోడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తుల దర్శనానికి అనుకూలంగా ఏర్పాట్లు చేశాము. మట్టితో చేసిన గణపతి మండపం వద్దనే కరిగించి నిమజ్జనం చేయాలనుకుంటున్నాం. నీటితో మట్టి గణపతిని కరిగించడానికి.. తుంగ్రభద్ర నీటిని ఫైరింజన్ల సహాయంతో తీసుకువస్తాము. అందుకోసం అధికారులతో మాట్లడి తగిన ఏర్పాట్లు చేసుకున్నాము". -కల్యాణ్, నిర్వాహకుడు
ఇవీ చదవండి: