ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టార్పాలిన్‌ కిందే తరగతులు.. విద్యార్థులకు ఇబ్బందులు

By

Published : Feb 5, 2021, 7:36 AM IST

విద్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా కొన్ని చోట్ల పాఠశాలల్లో మౌలిక వసతులు కరవవుతున్నాయి. సరైన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

Classes under the tarpaulin
Classes under the tarpaulin

సరిపడా గదులు లేకపోవడంతో కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కంబళదిన్నె ఉన్నత పాఠశాల విద్యార్థులు టార్పాలిన్‌ కిందే విద్యనభ్యసించాల్సిన దుస్థితి. ఈ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను 2017లో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఆరు నుంచి పదో తరగతి వరకు 330మంది చదువుతున్నారు. జడ్పీ పాఠశాలగా స్థాయి పెంచినప్పటికీ రెండు గదులు మాత్రమే కేటాయించారు.

వాటిల్లో తొమ్మిది, పది తరగతులకు బోధించేవారు. మిగిలిన విద్యార్థుల బోధనకు గదులే లేవు. ప్రస్తుతం ఆ రెండు గదులకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ఆరు నుంచి పది తరగతుల వరకు బడి ఆవరణలోనే పాఠాలు బోధిస్తున్నారు. వారం రోజుల నుంచి ఎండలు ఎక్కువ కావడంతో నీడ కోసం టార్పాలిన్‌ను ఏర్పాటుచేసినట్లు ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ రైతు ఈ టార్పాలిన్‌ను సాయం చేశారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details