ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Live video: సుంకేశ్వరీలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ - సుంకేశ్వరీ వార్తలు

కర్నూలు జిల్లా సుంకేశ్వరీలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఉదయం రెండు పార్టీల మధ్య బ్యానర్‌ విషయంలో గొడవ పడ్డారు. సాయంత్రం లక్ష్మమ్మ అమ్మవారి జాతరలో మరోసారి వివాదం నెలకొంది. ఇరువర్గాల దాడులు చేసుకున్నారు.

clash
clash

By

Published : Jun 25, 2021, 12:14 PM IST

సుంకేశ్వరీలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరిలో... లక్ష్మమ్మ అవ్వ జాతర సందర్భంగా తెలుగుదేశం, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా.. గురువారం సాయంత్రం లక్ష్మమ్మ అవ్వ జాతర నిర్వహించారు. బ్యానర్‌ విషయంలో ఉదయమే రెండు పార్టీల నేతలు కార్యకర్తలు గొడవపడ్డారు. అవ్వ ప్రభ ఊరేగింపు సమయంలో ఎదురుపడిన వైకాపాకు చెందిన సర్పంచ్‌ ముక్కరన్నా... తెలుగుదేశం వర్గాలు వాదనకు దిగారు. అది ఘర్షణకు దారితీయటంతో... రాళ్లు, చెప్పులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు రెండు వర్గాలనూ విడదీశారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details