ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. సముదాయించిన పోలీసులు - rain water stagnate

నవంబర్ 2న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వర్షం నీటిని తొలగించాలని విద్యార్థి సంఘం నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లు దేవకుంటలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.

ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. సముదాయించిన పోలీసులు
ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. సముదాయించిన పోలీసులు

By

Published : Oct 25, 2020, 12:31 AM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నీరు భారీగా నిలిచింది.

2న పాఠశాలలు ప్రారంభం..

నవంబర్ 2న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వర్షం నీటిని తొలగించాలని విద్యార్థి సంఘం నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

జేసీబీ ద్వారా..

వెంటనే అధికారులు స్పందించి నీటిని జేసీబీ ద్వారా తొలగించేందుకు చర్యలు చేపట్టారు. తమ ఇంటి ముందు నుంచి నీరు వెళ్లటానికి వీళ్లేదని ఓ వర్గం అదే మార్గం నుంచి నీరు వెళ్లాలని మరో వర్గం ఘర్షణకు దిగి జేసీబీని అడ్డుకున్నారు.

పోలీసులు నచ్చజెప్పారు..

ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం పోలీసులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు ఉద్రిక్తత అనంతరం.. పోలీసులు ప్రజలకు నచ్చజెప్పి సమస్యను పరిష్కరించారు.

ఇవీ చూడండి : మేం పెయిడ్ ఆర్టిస్టులమైతే...మరి మీరెవరు ?: అమరావతి రైతులు

ABOUT THE AUTHOR

...view details